తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి టౌన్ : అత్యాచారం కేసులో సస్పెండ్ అయి శిక్ష అనుభవించిన వారికి నిబంధనలకు విరుద్ధంగా రీజాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన రెవెన్యు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆర్‌టీఐ విజిల్ బ్లోవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కో కన్వీనర్ కోన బాబురావు కోరారు. గత సోమవారం కలెక్టర్ విజయకృష్ణన్‌కు పీజీపీఆర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా కోన బాబురావు మాట్లాడుతూ కొరుప్రోలు గ్రామ వీఆర్‌ఏ చిన్నబ్బాయికి రీజాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన, అవినీతి, అక్రమాలతో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా లింగరాజుపాలెం వీఆర్‌ఏగా చిందాడ సత్యనారాయణకు ఉద్యోగం ఇచ్చిన గత తహసీల్దార్ విజయ్‌కుమార్‌పై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి కోరారు. కొరుప్రోలు వీఆర్‌ఏ చిన్నబ్బాయిపై 2023 ఏడాది డిసెంబర్ 11న ఎఫ్‌ఐఆర్ నెం.445/2023 సెక్షన్ ఐపీసీ 376(2)ఎన్ కింద అత్యాచారం కేసు నమోదైందని పేర్కొన్నారు. దీంతో రిమాండ్ నిమిత్తం 3 నెలల కాలంలో సస్పెండ్ అయి మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారని, గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు తీసుకుని అతనికి రీజాయినింగ్ ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా లింగరాజుపాలెం వీఆర్‌ఏ చిందాడ అప్పారావు మరణాంతరం ఆయన కుమారుడికి వీఆర్‌ఏ ఉద్యోగం అర్హత లేకున్నా సత్యనారాయణకు అర్హత లేకున్నా..46 ఏళ్లు ఉన్న ఆయనకు ఉద్యోగం ఇచ్చారని, తొలుత అర్హత లేకపోవడంతో తిరస్కరించిన తరువాత కూడా ఆర్‌ఐ వినయ్, సీనియర్ అసిస్టెంట్ మణికంఠ లంచం తీసుకుని అప్పటి తహసీల్దార్ విజయకుమార్ ద్వారా ఉద్యోగాలు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే రెండుమూడు సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా తహసీల్దార్‌పై చర్యలు తీసుకోలేదని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment