కరుణ కురిసింది..
మూగజీవులకు నీరు దొరికింది
ఈ కాంక్రీట్ జంగిల్‌లో పక్కనున్న మనుషుల గురించే పట్టించుకోరు.. మరి పశు పక్ష్యాదుల గురించి ఆలోచించేదెవరు? వేసవిలో మూగజీవుల దాహార్తి ఎలా తీరుతుంది.. వాటికి నీటిని అందుబాటులో ఉంచితే ఎంతో బాగుంటుంది కదా.. ఈ ఆలోచనలను బాలల్లో రేకెత్తించేలా ఈనెల 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని కె.కోటపాడులోని ఒక ప్రైవేట్ పాఠశాల వినూత్న కార్యక్రమం నిర్వహించింది. తమ విద్యార్థులతో శుక్రవారం పాఠశాల ఆవరణలో పక్షులకు ప్రత్యేకమైన పాత్రలలో నీటిని ఏర్పాటు చేయించారు. పశువులు, శునకాల దాహర్తిని తీర్చేందుకు తొట్టెలలో నీటిని అందుబాటులో ఉంచారు. చేపలకు నీటి వనరుల ప్రధాన అవసరాన్ని వివరించేందుకు.. నీటితో నింపిన ట్రేలలో చేపలను వేసి అయ్యన్న విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె.ఖాసిమ్ విద్యార్థులకు చూపించారు. మనకు ఎంతో మేలు చేసే మొక్కలు బతకడానికి నీరు ఎంత అవసరమో ఆచరణాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. వరల్డ్ వాటర్ డేను పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన గ్రేసియర్ ప్రిజర్వేషన్ థీమ్‌కు తగ్గట్టుగా విద్యార్థి గీసిన చిత్రం తోటి విద్యార్థులను ఆకట్టుకుంది. – కె.కోటపాడు
పశువులకు తొట్టెలలో నీటిని అందిస్తున్న చిన్నారులు
కరుణ కురిసింది..
Comments
Please login to add a commentAdd a comment