జీవ వైవిధ్యాన్ని కాపాడాలి
అనకాపల్లి టౌన్ : ప్రతీ ఒక్కరూ సమస్త జీవవైవిధ్యాన్ని కాపాడాలని గ్రీన్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ అన్నారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో ఎండ తీవ్రత దృష్ట్యా పక్షులకు ధ్యాన్యపు కుంచెలు, మట్టి ప్రాతల్లో తాగునీరు, పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ రెండో వారంలో పట్టణంలో పార్కుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్దానిక ఎంపీ సీఎం రమేష్ వ్యక్తిగత సహాయకుడు విజయ్‌నాయుడు, దేవస్ధానాల చైర్మన్‌లు కాండ్రేగుల సత్యన్నారాయణ, బొడ్డేడ మురళి, బి.ఎం.ఎస్.కె జోగినాయుడు, పెంటకోట ఉమామహేశ్వరావు, యల్లపు సూరి అప్పారావు, వంకాయల ఈశ్వరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment