రోడ్డు విస్తరణకు నిర్వాసితుల ఆమోదం తప్పనిసరి
అచ్యుతాపురం రూరల్ : రోడ్డు విస్తరణకు నిర్వాసితుల ఆమోదం తప్పనిసరని, లేని పక్షంలో ఎటువంటి శంకుస్థాపనలు చేయొద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. భూములు, ఇళ్లు, షాపులు కోల్పోతున్న నిర్వాసితులతో చర్చించకుండా టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించకుండా ఏకపక్షంగా టీడీఆర్ బాండ్లు ప్రకటించడం అన్యాయమన్నారు. నగదు రూపంలో చెల్లించి భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్న చిరు వ్యాపారులకు పరిహారం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ రొంగలి రాము, పార్టీ నాయకులు కాండ్రేగుల రాము, సదాశివరావు, కర్రి అప్పారావు, బుద్ధ రంగారావు, చేపల తాతయ్య, కూండ్రపు సోమునాయుడు, రామ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment