కౌంటింగ్‌ రోజు తాడిపత్రిలో కట్టుదిట్టమైన భద్రత | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ రోజు తాడిపత్రిలో కట్టుదిట్టమైన భద్రత

Published Fri, May 24 2024 6:50 AM

కౌంటింగ్‌ రోజు తాడిపత్రిలో కట్టుదిట్టమైన భద్రత

తాడిపత్రి అర్బన్‌: కౌంటింగ్‌ సందర్భంగా తాడిపత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అనంతపురం రేంజ్‌ డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ గౌతమి శాలి గురువారం పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాస ప్రాంతాలు, జూనియర్‌ కళాశాల మైదానంతో పాటు ఫ్లై ఓవర్‌, పుట్లూరు రోడ్డులోని టీడీడీ కల్యాణ మండపం, యల్లనూరు రోడ్డులోని శివాలయం, కడప రోడ్డులోని ఐశ్వర్య విల్లాస్‌, సజ్జలదిన్నె క్రాస్‌, చుక్కలూరు క్రాస్‌, నందలపాడు, పెద్దపప్పూరు రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులను పరిశీలించారు. అనంతరం డీఎస్పీలు జనార్దన్‌నాయుడు, శివారెడ్డి, బి.శ్రీనివాసులు, శివభాస్కర్‌రెడ్డితో మాట్లాడుతూ కౌంటింగ్‌ రోజున అనుమానితులెవ్వరూ పట్టణంలోకి ప్రవేశించకుండా శివార్లలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ముఖ్య నాయకుల ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐలు నాగేంద్రప్రసాద్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐలు గౌస్‌బాషా, సాగర్‌లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement