
మెరిసిన మట్టిలో మాణిక్యాలు
అనంతపురం ఎడ్యుకేషన్: వారు లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేదు. అంతా కూలినాలి చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారే. చాలామంది తల్లిదండ్రులు నిర్లక్షరాస్యులే. వారికి చదువులు లేవు కానీ పిల్లలపై గంపెడాశలైతే ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు. తమ కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చుకానీ తమ చదువుకు ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం ఆటంకం కావని నిరూపించారు ఆ విద్యార్థులు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాను కాదని ఎక్కడో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కర్నూలు లాంటి నగరాల్లో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ విద్యార్థులు మార్కులు సాధించారు. వారితో పోటీపడీ మార్కులు సాధించి పలువురితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విద్యార్థులకు వచ్చిన మార్కులు చూసి వారికి చదువులు చెప్పిన అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.... తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. పైసా ఖర్చు లేకుండా తమ విద్యార్థులు సత్తా చాటారంటూ ప్రిన్సిపాళ్లు ధీమాగా చెబుతున్నారు.
పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్, ప్రైవేట్‌తో పోటీ
ఇంటర్‌లో రాణించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు

మెరిసిన మట్టిలో మాణిక్యాలు

మెరిసిన మట్టిలో మాణిక్యాలు

మెరిసిన మట్టిలో మాణిక్యాలు