AP Political News Jan 11th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Political News Updates Headlines 11th Jan 2024 Telugu | Sakshi
Sakshi News home page

AP Political News Jan 11th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Jan 11 2024 7:14 AM | Updated on Jan 11 2024 9:22 PM

AP Elections Political News Updates Headlines 11th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

09:00PM, జనవరి 11, 2024
వైఎస్సార్‌సీపీ మూడో జాబితా.. సామాజిక న్యాయం

  • వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మూడో జాబితా విడుదల
  • జాబితా ప్రకటించిన సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
  • ఆరు ఎంపీలు, 15 అసెం‍బ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జిల నియామకం
  • సామాజిక సమీకరణాల ఆధారంగానే జాబితా రూపకల్పన
  • సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకుని జాబితా
  • చిత్తూరు, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో వెనుకబడిన వర్గాలకే ప్రాధాన్యం
  • బీసీలకు, ఎస్సీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితా
  • పలువురికి ఎంపీ స్థానాలకు ఇన్‌ఛార్జిలుగా ప్రమోషన్‌
  • ఇప్పటిదాకా మూడు జాబితాల్లో కలిపి.. 9 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జిల మార్పు
  • మొత్తం 50 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఇన్‌ఛార్జిల మార్పు


 

07:56PM, జనవరి 11, 2024
కాసేపట్లో వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిల ప్రకటన

  • ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో మార్పులు
  • మూడో జాబితా విడుదల చేయనున్న వైఎస్సార్‌సీపీ
  • సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్న సజ్జల, బొత్స, కొడాలి నాని
  • 23 మంది ఇన్‌చార్జిల పేర్లు వెల్లడించే అవకాశం

07:54PM, జనవరి 11, 2024
ఇది ఆరంభం మాత్రమే: కేశినేని నాని

  • వైఎస్సార్‌సీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు
  • ఎక్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని
  • ఇది ఆరంభం మాత్రమేనంటూ టీడీపీకి చురకలు
  • మనల్ని అవమానించిన వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటూ స్వామిదాసును ఉద్దేశించి కేశినేని ట్వీట్‌

07:30PM, జనవరి 11, 2024
చంద్రబాబు మమ్మల్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు

  • సాక్షిటీవీతో మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు
  • అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు
  • ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు
  • 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు
  • భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు
  • టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు
  • మాతో మంచిగా ఉంటూనే వెన్నుపోటుతో ఓడించారు
  • మా దళితులకు సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలు అద్భుతం
  • అవి నచ్చి జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాం
  • జగన్ ఏం చెప్తే అది చేయటానికి మేము సిద్ధం



07:15PM, జనవరి 11, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌

  • టీడీపీని వీడిన నల్లగట్ల స్వామిదాస్‌
  • తిరువూరుకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్వామిదాస్‌
  • సీఎం క్యాంప్‌ కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిక
  • వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్న స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి 
  • 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన స్వామిదాస్‌

06:51PM, జనవరి 11, 2024
కాక పుట్టిస్తున్న కాపు పాలిటిక్స్‌ 

  • ఏపీలో ఎన్నికల వేళ కాక పుట్టిస్తున్న కాపు పాలిటిక్స్‌ 
  • కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి కాపు నేతల క్యూ
  • కిర్లంపూడికి క్యూ కట్టిన మూడు పార్టీల నేతలు
  • బుధవారం ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ సమావేశం
  • ఇవాళ ఉదయం  ముద్రగడతో బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన  ముగిసిన టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ 
  • కాసేపట్లో ముద్రగడతో భేటీ కానున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
     

06:32PM, జనవరి 11, 2024
హనుమాన్ జంక్షన్ లో తన్నుకున్న జనసైనికులు 

  • ఓ ప్రైవేట్ స్థలం సరిహద్దు పై గత కొన్ని నెలలుగా జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం
  • స్థల వివాదం సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో సవాళ్లు విసురుకున్న ఇరువర్గాలు
  • తన్నుకునేందుకు టైం చెప్పి మరీ ఘర్షణకు సిద్ధమైన వైనం 
  • ఒక వర్గానికి నాయకత్వం వహించిన గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి చలమలశెట్టి రమేష్ 
  • చలమలశెట్టి రమేష్ వర్గం ఓవైపు.. మరో వర్గం ఇంకోవైపు రోడ్డెక్కిన జనసైనికులు 
  • ఇరువర్గాల మధ్య తోపులాట 
  • ఎందుకు ఘర్షణ జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి 
  • విషయం తెలుసుకుని ఇరువర్గాలకు సర్ధిచెప్పిన పోలీసులు

06:25PM, జనవరి 11, 2024
పొత్తుల తక్కెడలో కొట్టుమిట్టాడుతోన్న టీడీపీ-జనసేన

  • ఏ సీటులో ఏ పార్టీ పోటీ చేస్తుంది? 
  • టీడీపీ ఎన్ని? జనసేనకు ఎన్ని?
  • సంక్రాంతికి తొలి జాబితా ప్రకటించాలని రెండు పార్టీల్లో డిమాండ్‌లు
  • 20 నుంచి 25 స్ధానాల్లో అభ్యర్ధులను టీడీపీ ప్రకటించే ఛాన్స్ 
  • ఖాయంగా పోటీ చేసే నేతల పేర్లపై అనుమానాలు
  • ఉంటారా? చివరి క్షణంలో జంపవుతారా అని టిడిపిలో ఆందోళనలు
  • తొలి జాబితాలో ఎవరెవరు ఉండాలి? చంద్రబాబు చర్చలు
  • ఐవీఆర్ఎస్ విధానంలో ఇప్పటికే సర్వే నిర్వహిస్తోన్న టీడీపీ 
  • ఓ జాతీయ సర్వే సంస్థ ద్వారా ప్రజాభిప్రాయం కోసం కసరత్తు

05:54PM, జనవరి 11, 2024
సంక్రాంతికి ఊరెళ్తా.. ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్‌

  • ఏపీ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ 
  • సంక్రాంతికి తన ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ 
  • తనపై పోలీసులు కేసు పెట్టే అవకాశం ఉందని పిటిషన్‌
  • రఘురామకృష్ణంరాజు తరపున వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ వైవీ రవిప్రతాప్, న్యాయవాది ఉమేష్ చంద్ర
  • ఆర్నేష్ కుమార్ కేసులో 41ఏ నిబంధనలను పాటించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన న్యాయవాది 
  • తనను అరెస్ట్‌ చేయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
  • రఘురామకృష్ణంరాజు పై పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి 
  • రఘురామకృష్ణంరాజు పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించిన ప్రభుత్వ న్యాయవాది 
  • కేసు నమోదై, అది ఏడేళ్ల శిక్ష ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్న ప్రభుత్వ న్యాయవాది 
  • ఎంపీ రఘురామపై ఎటువంటి కేసులు పెట్టలేదని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది 
  • ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులు రేపు ఇస్తామని వెల్లడించిన కోర్టు

05:54PM, జనవరి 11, 2024
టీడీపీ విష రాజకీయం

  • సీఎం జగన్‌ వాయిస్‌ మార్ఫింగ్‌ చేసే కుట్ర
  • మిమిక్రీ ఆర్టిస్టులను సంప్రదించిన పచ్చపార్టీ నేతలు
  • ఎక్స్‌లో ఆధారాలతో పోస్ట్‌ చేసిన వైఎస్సార్‌సీపీ


05:45PM, జనవరి 11, 2024
సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వరుసగా.. 

  • వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిల మార్పుల నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి నేతల క్యూ 
  • కార్యాలయానికి వచ్చిన తిరువూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు
  • మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధికి సైతం సీఎంవో నుంచి పిలుపు

05:27PM, జనవరి 11, 2024
మార్పులపై వరుస భేటీలు

  • పలు నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పుపై సీఎం జగన్‌ వరుస భేటీలు
  • సీఎం క్యాంపు కార్యాలయానికి నరసరావుపేట ఎమ్మెల్యే
  • సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
  • నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి నియామకం విషయంపై చర్చ
  • నరసరావుపేట పార్లమెంటు ఇన్‌ఛార్జి అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్‌ చర్చలు
  • ఎంపీ అభ్యర్థి ఎంపికపై పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో చర్చిస్తున్న సీఎం జగన్‌
  • మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సీఎం అపాయింట్‌మెంట్‌
  • క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  • నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి మార్పుపై సీఎం జగన్‌ చర్చ
  • ఎమ్మెల్యే సంజీవయ్యకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు
  • సీఎం జగన్‌తో సమావేశమై సీటు విషయమై చర్చిస్తున్న ఎమ్మెల్యే సంజీవయ్య

04:02PM, జనవరి 11, 2024
ఏపీ ఎన్నికల విధుల్లోకి టీచర్లు కూడా

  • ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభం
  • ప్రక్రియను ప్రారంభించిన ఎన్నికల సంఘం
  • సీఈవో ఆదేశాలతో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు
  • ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం నిర్వహించిన సీఈసీ భేటీలో ప్రస్తావన
  • సీఈసీ సూచనలతో జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ఆదేశాలు
  • శుక్రవారం ఉదయం 11 గంటల లోగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ వివరాలు ఇవ్వాలని డీఈవోలకు ఆదేశం
  • ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లుగా టీచర్లను నియమించనున్న ఈసీ

03:13PM, జనవరి 11, 2024
వైఎస్సార్‌సీపీ మూడో లిస్ట్‌ ప్రకటనకు రంగం సిద్ధం

  • అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పుల్లో వైఎస్సార్‌సీపీ
  • మూడో లిస్టు ప్రకటనకు రంగం సిద్దం చేస్తోన్న వైఎస్సార్‌సీపీ
  • అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీసుకు క్యూ కట్టిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు
  • క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వారిలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు
  • కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి,  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర నాథ్ రెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,
  • కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య,
  • గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి,  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
  • సామాజిక సమీకరణాల ఆధారంగా ఇప్పటికే రెండు జాబితాల ప్రకటన

02:52PM, జనవరి 11, 2024
చింతమనేనికి బిగ్‌ షాక్‌

  • దెందులూరు నియోజకవర్గం లో టీడీపీ జనసేన పార్టీలలో ముసలం
  • చింతమనేనికి వ్యతిరేకంగా ఏలూరులో సమావేశమైన టీడీపీ జనసేన నేతలు
  • ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు- ఎవరైనా ముద్దు అంటూ ఏలూరులో  ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన నాయకులు
  • 2024 ఎన్నికల్లో చింతమనేని తప్ప టీడీపీ జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఇంకెవరినైనా ప్రకటించాలంటూ తీర్మానం చేసిన సభ్యులు
  • టీడీపీలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గమే చింతమనేని వ్యతిరేకిస్తోందంటున్న నాయకులు
  • చింతమనేని ప్రభాకర్ గతంలో చేసిన దారుణాలకు ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొత్త అభ్యర్థి వస్తేనే తాము మద్దతు ఇస్తామంటూ తెలిపిన జనసేన నాయకులు

02:21PM, జనవరి 11, 2024
అది బీసీల సభ? రాజుల సభ??

  • చంద్రబాబు బొబ్బిలి సభ అట్టర్ ప్లాప్ అయ్యింది
  • సభలో జనాలు లేక ఇబ్బంది పడ్డారు
  • చంద్రబాబు అల్జీమర్స్ వల్ల అన్ని మరిచిపోతున్నారు
  • బీసీ జిల్లాలో ముగ్గురు రాజులను ప్రక్కనపెట్టుకొని చంద్రబాబు సభ నిర్వహించారు
  • బీసీ మహిళను మంత్రిగా తొలగించి రాజులకు మంత్రి పదవి ఇచ్చి బిసిలకు అన్యాయం చేశారు
  • కేంద్రంలో రెండు మంత్రి పదవులు అవకాశం వస్తే రెండు పదవులు అగ్రవర్ణాలకే ఇచ్చారు
  • సామాజిక సాధికార కోసం ప్రయత్నిస్తున్న గొప్ప నాయకుడు వైయస్ జగన్
  • భోగాపురం ఎయిర్ పోర్ట్ ను చంద్రబాబు తీసుకురాలేక పోయారు
  • అబద్ధాలు, మోసపు మాటలు తప్పా కొత్త విషయాలు ఏమి లేవు
  • రైతులను కూడా మోసం చేశారు 
  • బిసిల పట్ల చిత్తశుద్ధి ఉంటే బొబ్బిలిని బిసిలకు కేటాయించండి 
  • ఎన్ సి ఎస్ షుగర్స్ ను ప్రవేటికరణ చేసి రైతుల పొట్టకొట్టిన వ్యక్తి చంద్రబాబు
  • వైఎస్సార్‌సీపీ విజయనగరం అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యలు


01:20PM, జనవరి 11, 2024
లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన

  • చంద్రబాబు ఊరూరు వెళ్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారు
  • లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?
  • కర్నూలుకు చంద్రబాబు చేసిందేమీ లేదు
  • అన్ని పార్టీలతో చంద్రబాబు దోస్తీ చేస్తారు
  • బీజేపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, జనసేన పార్టీలతో బాబు దోస్తీ
  • 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వంలో 22 శాతం అప్పులు పెరిగాయి
  • నాలుగున్నరేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 12 శాతం మాత్రమే అప్పు
  • ఏపీ ప్రభుత్వ అప్పులపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం
  • చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 6 శాతం
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 16.7శాతం రెవెన్యూ రాబడి
  • 2018-19 చంద్రబాబు పాలనలో 5.3 శాతం నిరుద్యోగిత

12:54PM, జనవరి 11, 2024
మహిళా సాధికారత జగన్ వలనే సాధ్యమైంది: పోతుల సునీత

  • చట్టసభల్లో సైతం అధిక ప్రాధాన్యత మహిళలకే ఇచ్చారు  సీఎం జగన్‌
  • కేంద్రం 33% మాత్రమే రిజర్వేషన్ కల్పించింది
  • కానీ సీఎం జగన్ 50% పైగా అవకాశాలు కల్పించారు
  • మహిళలను కించపరిచే పవన్‌కు తగిన బుద్ది చెబుతాం 
  • మహిళా సాధికారత జగన్ వలనే సాధ్యమైంది
  • టార్గెట్ 175 నియోజకవర్గాలనే లక్ష్యంలో మా వంతు కృషి చేస్తాం 

        -

12:30 PM, జనవరి 11, 2024
బాబు, పవన్‌కు మహిళలు తగిన బుద్ది చెబుతారు: వరుదు కల్యాణి 

  • మహిళలపై పవన్, చంద్రబాబు చేసే ఆరోపణలకు ఓట్ల రూపంలోనే తగిన బుద్ది చెప్తాం
  • సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ విజయాన్ని తెచ్చిపెడతాయి
  • గతంలో ఏ సీఎం కూడా ఇవ్వనంత ప్రాధాన్యత జగన్ మాకు కల్పించారు
  • ఒక మహిళ సీఎంగా ఉన్నాకూడా మాకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేరేమో?
  • రానున్న వంద రోజులు అత్యంత కీలకంగా భావిస్తున్నాం 
     

11:45AM, జనవరి 11, 2024
చంద్రబాబుపై కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఫైర్‌

  • కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసి విమర్శించడం సరైనది కాదు.
  • పాణ్యం నియోజకవర్గంలో సామాజిక సాధికారత బస్సు యాత్రలో సీఎం జగన్‌ గురించి సంజీవ్ కుమార్ పొగిడారు.
  • సీఎం జగన్‌ చేసిన మేలుపై ప్రజలకు తెలియజేశారు.
  • పార్టీ టికెట్ రాకపోతే ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదు.
  • కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీకే టికెట్‌ను కేటాయిస్తే సంజీవ్ కుమార్ వ్యతిరేకించడం చాలా బాధాకరం.
  • టికెట్‌ ఇవ్వకపోయినా పార్టీకి విధేయుడిగా ఉండాల్సిన సంజీవ్ కుమార్ విమర్శలు చేస్తున్నారు.
  • ఇప్పటికైనా ఆయన పార్టీలోకి రావాలి..
  • రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు.
  • ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకొని 2019 ఎన్నికల్లో బుద్ది చెప్పారు.
  • వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ కావడం ఖాయం.
     

11:00AM, జనవరి 11, 2024

టీడీపీ, ఎల్లో మీడియా నాపై దుష్ఫ్రచారం:
నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదాల  ప్రభాకర్ రెడ్డి 

  • నేను రూరల్ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీడీపీ నేతలు వెన్నులో వణుకు పుడుతుంది
  • వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచి పోటీ చేస్తా.. గెలిచి తీరుతాను
  • రూరల్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు
  • టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంది.. జనసేన, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేసినా.. వారికీ ఓట్ల శాతం తగ్గడం తప్ప.. మాకు నష్టం లేదు
  • మళ్లీ  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదాల ధీమా

10:40AM, జనవరి 11, 2024
బాబు నీ కొడుకే నీకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి వస్తుంది: ద్వారంపూడి

  • చంద్రబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్
  • ఖబడ్ధార్ చంద్రబాబు.. లేనిపోని మాటలు  అంటే మర్యాదగా ఉండదు.
  • నువ్వు ఏమీ చేయలేవు. 
  • నేను నోరు విప్పితే నువ్వు, లోకేష్ ఇంట్లో కూర్చుంటారు
  • నేను కూడా నిన్ను అనగలను, కానీ సంస్కారం అడ్డువస్తోంది. 
  • మా మీద పడి ఏడవకు.
  • నీ నీడను కూడా నువ్వు నమ్మవు
  • నీ కొడేకే నీకు వెన్నుపోటు పోడిచే పరిస్ధితి వస్తుంది
  • మరో నెల రోజులు నువ్వు జైలులో ఉండి ఉంటే బాలకృష్ణ, నీ కొడుకు ఈపాటికే నిన్ను దింపేసేవారు.
  • మా నాయకుడు సీఎం జగన్ కింద నమ్మకంగా పని చేసే లీడర్లు ఉన్నారు.
     

10:20AM, జనవరి 11, 2024
టీడీపీ, జనసేనతో జరిగేదేమీ లేదు: సామాన్యుడు

  • టీడీపీ, జనసేనల పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండదు
  • సీఎం జగన్‌ పరిపాలన చాలా బాగుంది. 
  • అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు
  • అభివృద్ధిపథంలో నడుస్తున్న రాష్ట్రం
  • మరోసారి జగనే ముఖ్యమంత్రి. 

10:00AM, జనవరి 11, 2024
చంద్రబాబుకు దాడిశెట్టి రాజా కౌంటర్‌

  • సభలో జనం లేక చంద్రబాబు పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు.
  • మా సామాజిక వర్గాన్ని(కాపులను) మోసం చేసి అవమానపరిచాడు
  • చంద్రబాబు దగా, మోసాన్ని ఎవ్వరూ మరచిపోలేదు
  • ప్రజలు ప్రతీ విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు
  • సంక్రాంతి తరువాత టీడీపీ ఖాళీ, అభ్యర్ధులు కూడా దొరకరు.
  • 2014 నుండి 2019 వరకు ఈ రాష్ట్రంలో నీ దోపిడి పరిపాలనే సాగింది.
  • రాష్ట్రాన్ని నువ్వు నీ కుటుంబ అడ్డంగా దోచుకున్నారు.
  • 2014-2019లో మరుగుదోడ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయాలు నీ యనమల అనుచరులు దోచేసుకున్నారు.
  •  వెన్ను పోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని చంద్రబాబు లాక్కున్నాడు.

9:20AM, జనవరి 11, 2024

అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు షాక్‌!

  • 2024 ఎన్నికల్లో కొడుకును ఎంపీగా బరిలో దించాలని అయన్న యత్నం
  • కొడకును బరిలోకి దించకపోతే తన రాజకీయ వారసత్వమే కష్టమని భావిస్తున్న అయ్యన్న.
  • దాంతో కుమారుడ్ని ఎంపీగా పోటీలో నిలపడానికి తీవ్ర ప్రయత్నాలు
  • చంద్రబాబకు పదే పదే విన్నపాలు..
  • ఇప్పటివరకూ ఇదిగో చూద్దాం.. అదిగో చేద్దాం అంటూ బాబు దాటవేత ధోరణి
  • ఆ నియోజకవర్గంలో ఇప్పుడు బాగా డబ్బులు ఖర్చు చేసే అభ్యర్థి దొరకడంతో అయ్యన్నకు ‘నో ’చెప్పేసిన బాబు
  • కొద్దిరోజులు క్రితం అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వలేనంటూ అయ్యన్నకు తేల్చిచెప్పేసిన బాబు..!
  • చేసేదిలేక ఇదేనా నాకు ఇచ్చే గౌరవం అంటూ లోలోపల కుమిలి పోతున్న అయ్యన్న

8:30 AM, జనవరి 11, 2024
సీఎం జగన్‌ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: కొడాలి నాని

  • వైఎస్సార్‌సీపీ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
  • ఉద్యోగులకు న్యాయం చేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉంది.
  • ఇప్పుడున్న పథకాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు ప్రకటించిన పథకాలతో ఏమవుతుంది.
  • పెనం మీద ఉండడం కరెక్టా.. పొయ్యిలో పడడం కరెక్టో ఉద్యోగులు ఆలోచించుకోవాలి.
  • మనసుతో ఆలోచించే సీఎం జగన్ ఉద్యోగుల కష్టాలు ఇబ్బందులను కచ్చితంగా పరిష్కరిస్తారు.
  • ఉద్యోగులను ప్రభుత్వం తమ సొంతవాళ్ళుగా భావిస్తూ పేదల పథకాల కోసం కొన్ని సందర్భాల్లో వారికి ఇచ్చే నిధులు వినియోగించాం.
  • పేదలకు మంచి చేసిన పుణ్యం ఉద్యోగులకు కూడా దక్కుతుంది.
  • ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన సమస్యలను తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తా.
  • ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికి ఉండాలి.

7:30 AM, జనవరి 11, 2024
చెత్త రాజకీయాలకు తెర తీసిన టీడీపీ

  • ఓటమి భయంతో పచ్చ బ్యాచ్‌ చెత్త పాలిటిక్స్‌
  • సీఎం జగన్‌లా మాట్లాడితే రూ.20 లక్షలు ఇస్తామని టీడీపీ ఆఫర్‌
  • మిమిక్రీ ఆర్టిస్ట్‌ రవి సంచలన కామెంట్స్‌

7:00 AM, జనవరి 11, 2024
సంపాదించేదేమీ లేదట..!

  • రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్వేదం
  • భార్య పురందేశ్వరీ రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలు
  • ఇప్పుడున్న పరిస్ధితిలో ఎన్నికలంటే బోలెడు ఖర్చు
  • రూ.30, 40 కోట్లు ఖర్చు పెడితే తప్ప గెలవలేరు
  • గెలిచినా ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యం 
  • టికెట్ రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు నా దృష్టిలో అదృష్టవంతులు 
  • తనకు టికెట్‌ రాదన్న బాధలో దగ్గుబాటి చెబుతున్నారా?
  • లేక రాజకీయాలపైనే దగ్గుబాటికి విరక్తి పుట్టిందా?

6:45 AM, జనవరి 11, 2024
కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

  • నాని సంచలన వ్యాఖ్యలు
  • సీఎం జగన్‌ పేదల పక్షపాతి
  • రాజీనామా తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నా 
  • సీఎం జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా
  • సీఎం జగన్‌ ఏ బాధ్యత అప్పగిస్తే దానిని నిర్వర్తిస్తా
  • చంద్రబాబు కొడుకుగా తప్పించి లోకేష్‌కు ఏ అర్హత లేదు
  • విజయవాడ పట్ల చంద్రబాబుకి చిత్త శుద్ధి లేదు
  • విజయవాడ అంటే నాకు ఎంతో ప్రేమ
  • టీడీపీపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు 
  • నా విషయంలో టీడీపీ ప్రోటోకాల్‌ విస్మరించింది
  • ఇష్టానుసారం నన్ను తిట్టినా పట్టించుకోలేదు
  • నన్ను చాలా రకాలుగా అవమానించారు
  • ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని ఆనాడే చంద్రబాబుకి చెప్పా
  • అయినా నువ్వు ఉండాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టాడు
  • త్వరలో టీడీపీ ఖాళీ కాబోతోంది
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ కాబోతోంది
  • చంద్రబాబు అంతటి పచ్చి మోసగాడు మరొకరు లేడు
  • అది ప్రపంచానికి తెలుసు
  • కానీ ఇంత పచ్చి మోసగాడు దగా చేస్తాడని అనుకోలేదు
  • కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాడు
  • రాష్ట్రానికి పనికి రాని వ్యక్తి చంద్రబాబు
  • 2019లో నాకు సీటు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రయత్నించారు 
  • 2014 -19 మధ్యలో బాబు విజయవాడకు ఒక్క పైసా ఇవ్వలేదు
  • టీడీపీ కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేశా 
  • రాజీనామా ఆమోదించిన తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరతా

6:30 AM, జనవరి 11, 2024
ఏపీ ఓటర్‌ లిస్ట్‌పై సీఈసీ కీలక ప్రకటన

  •  ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి 
  •  ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం 
  • ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి 
  • ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం 
  • ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తాం 
  • నిన్న విజయవాడ లో పార్టీలతో సమావేశం నిర్వహించాం 
  • ఓటర్ల జాబితా లో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి 
  • పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది 
  • ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి 
  • ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది 
  • అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం 
  • ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు 
  • ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ 
  • మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభపరిణామం 
  • మహిళా ఓటర్లు 2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారు 
  • ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం 
  • వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారు 
  • తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలు 
  • గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు 
  • అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం 
  • అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం 
  • రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి 
  • సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిథిలో 870 మంది ఓటర్లు 
  • కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి 
  • 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది : కేంద్ర ఎన్నికల సంఘం
  • ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం: కేంద్ర ఎన్నికల సంఘం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement