
సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్ ద్వారా గురువారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.' ప్రధాని మోదీజీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఎల్లప్పుడు ఆయురారోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అంటూ ట్వీట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'దేశ సేవకు అంకితమైన మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. దేశానికి మీలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం మాకు ఆశీర్వాదం.'అంటూ తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని గవర్నర్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment