సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సీఎం వైఎస్ జగన్‌కు ఆపాదించడం.. వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లుతూ నీతిమాలిన రోత రాతలను అచ్చేయడంలో తనకు అలుపే లేదని రామోజీరావు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటున్నారు. కుక్క తోకలా తన బుద్ధీ ఎప్పటికీ వంకరేనని చాటుకోవడానికి ఆయనకు ఆయనే తెగ పోటీపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోత రాతలను అచ్చేయడాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే ‘పోలవరంలో ఇదేం దారుణం?’ శీర్షికన ‘ఈనాడు’లో తాజాగా ప్రచురించిన కథనం.
ఆ కథనంలోని ప్రతి అక్షరంలో కాంట్రాక్టర్‌గా తన కొడుకు వియ్యంకుడిని తప్పించారనే కోపం.. డీపీటీ (దోచుకో పంచుకో తినుకో)కి అడ్డుకట్టపడిందనే అక్కసు.. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తుండటంపై అసూయ కన్పించింది తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అసలు నిజాలు ఇవీ..
ఈనాడు ఆరోపణ: రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య సీపేజీ (ఊట నీరు) అంచనాలకు మించి 30 రెట్లు అధికంగా వచ్చింది..
వాస్తవం: కమీషన్లకోసం కక్కుర్తి పడి పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న చంద్రబాబు.. రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు కొడుకు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారు. ప్రాజెక్టు ప్రోటోకాల్‌కు విరుద్ధంగా.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలొచ్చే పనులు చేపట్టి, కమీషన్లు వసూలుచేసుకుని డీపీటీ విధానంలో పంచుకుతిన్నారు.
ఈ క్రమంలోనే గోదావరి వరదను మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేయకుండానే ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదం చేసింది. ఇందులో మరో ఘోరం ఏమిటంటే.. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పాక్షికంగా నిర్మించి, ఇరువైపులా 650 మీటర్ల ఖాళీ ప్రదేశం.. దిగువ కాఫర్ డ్యామ్‌ను పాక్షికంగా నిర్మించి, రెండు వైపులా 480 మీటర్ల ఖాళీ ప్రదేశం ఉంచింది.
కాఫర్ డ్యామ్‌లు అనేవి తాత్కాలిక కట్టడాలు మాత్రమే. వాటి పునాదుల గుండా సీపేజీ రాకుండా సాధారణంగా జెట్ గ్రౌటింగ్ విధానాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతిలో ఎగువ కాపర్ డ్యామ్ పునాదిని పటిష్టపరిచారు. 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది.
టీడీపీ సర్కార్ ఎగువ కాఫర్ డ్యామ్‌లో వదిలేసిన ఖాళీ ప్రదేశాల గూండా 13.5 మీటర్లు/సెకను అంటే గంటకు దాదాపు 40 కిమీల వేగంతో ఆ వరద ప్రవహించడంవల్ల జెట్ గ్రౌటింగ్ బలహీనపడి సీపేజీ అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు పెరిగింది. దానివల్లే రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యలోకి సీపేజీ నీరు చేరుతోంది. దీనికి పూర్తి బాధ్యత టీడీపీ సర్కార్‌దే. కానీ, మీ దోపిడీని కప్పిçపుచ్చుకునే క్రమంలో ఆ చారిత్రక తప్పును వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే ఎలా రామోజీ?
ఈనాడు ఆరోపణ: రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య చేరిన సీపేజీ నీటిని బయటకు పంపేందుకు డిప్లీటింగ్ స్లూయిస్ నిర్మాణాన్ని తమ అనుమతిలేకుండానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. ఇది చెయొద్దని చెప్పినా వినడంలేదని నాలుగు రోజుల క్రితం జరిగిన అంతర్గత సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి పీపీఏ అధికారులు తీసుకెళ్లారు. దీనికి ఆయన విస్తుపోయారు..
వాస్తవం: రామోజీరావు జర్నలిజం విలువల పతనానికి ఇది పరాకాష్ట. కేంద్ర జల్‌శక్తి శాఖ అంతర్గత సమావేశాలు నిర్వహించడం సాధారణమే. ఆ క్రమంలోనే గతనెల 29న ఓ సమావేశాన్ని నిర్వహించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం తమ మాట వినడంలేదని.. అనుమతులు తీసుకోకుండానే రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య చేరిన సీపేజీ నీటిని బయటకు పంపేందుకు దిగువ కాఫర్ డ్యామ్ కుడి గట్టున బటర్‌ఫ్లై తూము నిర్మిస్తున్నారని పీపీఏ అధికారులు ఫిర్యాదు చేసినట్లు.. దీనికి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి విస్తుపోయినట్లుగా అవాస్తవాలను రామోజీరావు చిత్రీకరించారు.
ఆ సమావేశంలో ఏ బల్ల కింద నక్కి విన్నావ్ రామోజీ? అసలు జరిగిన విషయం ఏమిటంటే.. రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యన చేరిన సీపేజీ నీటిని బయటకు పంపే పద్ధతిని సాంకేతికంగా మదింపు చేసి.. నిపుణులతో చర్చించి ఆర్థికంగా తక్కువ భారమయ్యేలా ఓ ప్రతిపాదనను పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది.
దిగువ కాఫర్ డ్యామ్‌కు ఆనుకుని కుడి వైపున ఉన్న తిప్పకు అంచులో పైపు తూములు నిర్మించి.. వాటికి నాన్–రిటర్న్ వాల్వులు అమర్చి.. వాటి ద్వారా సముద్ర మట్టానికి 18 మీటర్ల ఎత్తు వరకు ఉన్న నీటిని గ్రావిటీపై బయటకు పంపి, మిగిలి ఉన్న నీటిని పంపుల ద్వారా తోడిపోసే విధానాన్ని సూచించింది. ఆ ప్రతిపాదనకు అనుమతి వచ్చేలోగా విలువైన సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో పీపీఏకు సమాచారమిచ్చే సన్నాహక పనులనే జలవనరుల శాఖ చేపట్టింది. ఇదీ వాస్తవం.
ఈనాడు ఆరోపణ: ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీపై తప్పుడు ఫార్ములాతో తప్పిన అంచనాలు..
వాస్తవం: ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందే సీపేజీపై ఐఐటీ నిపుణులు అంచనా వేసినప్పుడు.. పునాదిని జెట్ గ్రౌటింగ్‌తో పటిష్టవంతం చేస్తే సీపేజీ పరిమితికి లోబడే ఉంటుందని లెక్కించారు. కానీ, టీడీపీ సర్కారు కమీషన్ల కోసం ప్రాజెక్టును పణంగా పెట్టింది. ప్రాజెక్టు ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు చేపట్టి.. వాటిని పూర్తిచేయలేక ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల 2019–20లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.
ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ కూడా దెబ్బతింది. దీనివల్లే సీపేజీ అధికంగా ఉంది. చంద్రబాబు సర్కార్ తప్పిదాలను వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేసేందుకే అభూత కల్పనలతో కథనాన్ని వండివార్చావన్నది వాస్తవం కాదా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment