
సాక్షి, అమరావతి: తీవ్రమైన తుపాను ‘దానా’ బలహీనపడింది. గురువారం రాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము 3:30 గంటల మధ్య ఒడిశాలోని హబాలిఖతి నేచర్ క్యాంప్ (భిత్తర్కనిక), ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. ఇది 10 కి.మీ వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తా ఒడిశా మీదుగా ఒడిశాలోని భద్రక్‌కు 30 కి.మీ, ధమ్రాకు 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుపాను కేంద్రం చుట్టూ గరిష్ట స్థిరమైన గాలులు గంటకు 80–90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఉత్తర ఒడిశా వద్ద వాయువ్య దిశగా కదులుతూ కొద్దిగంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment