సాక్షి, తాడేపల్లి: మహిళా పక్షపాతి.. సంక్షేమ సారథి జగనన్న అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
జగన్ పాలన విలువలు, విశ్వసనీయతతో సాగుతోంది. తనకు ఓటేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తున్నారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నలమూలల క్రీడా పోటీలను నిర్వహించాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నాం. క్రీడా సంబరాలు పెట్టి రూ.50 లక్షలు ప్రైజ్ మనీ అందిస్తున్నాం. వారి టాలెంట్‌ని గుర్తించి ప్రోత్సాహిస్తున్నాం. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించారు. అందుకే రాష్ట్ర మంతటా పండుగలా జగన్ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు’’ అని మంత్రి రోజా అన్నారు.
చదవండి: పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలా?: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment