
పెడన/చేజర్ల(సోమశిల): జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకు పోరాటం ఆపబోమని పలువురు వలంటీర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై సోమవారం కూడా పలు ప్రాంతాల్లో వలంటీర్లు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ‘పవన్ డౌన్ డౌన్...’ అంటూ నినాదాలు చేశారు.
వలంటీర్లు మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న తమను కించపరిచేలా మాట్లాడటం అన్యాయమన్నారు. తక్షణమే పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా అనంతసాగరంలో వలంటీర్లు నిరసన ప్రదర్శన నిర్వహించి పవన్‌కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఆర్టికల్ 139 ఏ కింద ఒక హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని గత విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వివరించారు. ఈ అంశంపై ఎగ్జామిన్ చేస్తామన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నేటికి(జులై 18కి) వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇతరత్రా అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది.
Comments
Please login to add a commentAdd a comment