
గేటును మూసివేస్తున్న సేవాదళ్ సభ్యులు
పుట్టపర్తి అర్బన్: కరోనా నేపథ్యంలో సత్యసాయి మహాసమాధి దర్శనాన్ని ఈ నెల 28 నుంచి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ మంగళవారం తెలిపారు.
సాయికుల్వంత్ మందిరంలో ప్రతి రోజూ జరిగే వేదపఠనం, భజన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. భక్తులు వీటిని ఆన్‌లైన్, ఫేస్‌బుక్‌లలో తిలకించవచ్చన్నారు. మహాసమాధి దర్శనం తిరిగి ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు.