అస్వస్థతకు గురైన విద్యార్థిని
తిరుపతి తుడా: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏడుగురు నర్సింగ్ విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి రుయా ఆస్పత్రిలోని వ్యాక్సినేషన్ సెంటర్‌లో శుక్రవారం జనరల్ నర్సింగ్ కాలేజికి చెందిన 38 మందికి వ్యాక్సిన్ వేశారు. వారిలో ఏడుగురు విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురవడంతో రుయాలోని అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు వారికి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు చేశారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు. అస్వస్థతకు గురైన లక్ష్మి, స్వాతి, ప్రసన్న, రూప, దుర్గ, ధనలక్ష్మి, సహనలను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి మీడియాకు తెలిపారు.
మంత్రి ఆళ్ల నాని ఆరా...
నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతితో శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. అస్వస్థత పాలైన నర్సింగ్ విద్యార్థినులకు ప్రత్యేక వార్డు కేటాయించి వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment