సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో పెద్ద పథకం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు.
► వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
► ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్ రిగ్ వాహనాలను సీఎం 28వ తేదీన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను కూడా సీఎం అదే రోజు ప్రారంభిస్తారు.
► ఆన్‌లైన్ విధానంతో పాటు ఎంపీడీవోల ద్వారా నేరుగా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్‌షెడ్ విభాగపు డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు.
28న ‘వైఎస్సార్ జలకళ’ ప్రారంభం
Published Wed, Sep 23 2020 4:12 AM | Last Updated on Wed, Sep 23 2020 4:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment