దొంగ.. దొంగ!
కురబలకోట : ముదివేడు పోలీసులకు సవాల్‌గా మారిన అంగళ్లు వరుస చోరీల కేసులో దొంగల కోసం వేట మొదలైంది. కురబలకోట మండలం అంగళ్లు కూడలి ప్రాంతంలో హైవే పక్కన శుక్రవారం రాత్రి దొంగలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. రాత్రి 12 గంటల నుండి రెండున్నర గంటల వరకు యథేచ్ఛగా ఒకే రోజు వరుసగా ఏడు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. షాపుల యజమానులు హడలిపోయారు. రూ.2.5 లక్ష విలువ చేసే సామగ్రి, రూ.పది వేలు నగదు చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీ చేసిన ఓ షాపులో సీసీ కెమెరాల్లో ఓ దొంగ ముఖ కవళికలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇద్దరు యువకులు సీసీ ఫుటేజీలో కన్పిస్తుండగా ఒకరు గుర్తు పట్టే విధంగా కన్పిస్తున్నారు. దీంతో ఇతని కోసం వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపి విచారిస్తున్నారు. మరో వైపు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. దొంగలు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ చోరీ కేసును ఛేదిస్తామని ఆదివారం తెలిపారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని కొత్తబస్వాపురంలో తొర్రివేముల నాగరాజు (34) ఆదివారం వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం వద్ద పందుల నివారణ కోసం ఏర్పాటు చేసిన వైరు తగలడంతో ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో..
రాయచోటి: రాయచోటి–చిత్తూరు మార్గంలోని రింగ్ రోడ్డు సమీప ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లా సుధాకర్ (50) మృతి చెందాడు. ఆదివారం ఉదయం బైకుపై వస్తున్న సుధాకర్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కలకడ మండలం, ఎగువ కురవపల్లి గ్రామానికి చెందిన వాడన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
అంగళ్లు దొంగల కోసం వేట
Comments
Please login to add a commentAdd a comment