గంగ జాతరలో ఏరులై పారిన మద్యం
లక్కిరెడ్డిపల్లి : గంగమ్మ జాతరలో మద్యం దుకాణాలు వెలిశాయి. బాటిల్‌పై రూ. 50 నుంచి రూ. 100 అదనంగా వసూలు చేసి మద్యం దుకాణదారులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఇదంతా జరుగుతున్నా ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. మద్యం దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టానుసారంగా జాతరలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి భక్తులను దండుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పేకాట క్లబ్బులు, స్లో బాల్ ఆటలను ఏర్పాటు చేసుకొని భక్తుల జేబులకు చిల్లులు వేశారు. ఇదంతా జాతర బయట జరగలేదు. జాతర మధ్యలో సందడిగా ఉన్న ప్రాంతంలో పేకాట క్లబ్బులు జరిగాయి. లక్షలాది రూపాయలు భక్తుల నుంచి దోచుకున్నారు. అడిగే నాథుడే లేకపోవడంతో రంగులరాట్నం, మిఠాయి దుకాణాలు మొదలుకొని చెరుకుల గడల వరకు దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న చందంగా అధికంగా వసూలు చేసుకొని వ్యాపాలు కొనసాగించారు. పట్టించుకోవాల్సిన అధికారులు తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు.
విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు
భక్తుల జేబులకు చిల్లులు
పట్టించుకోని అధికారులు
గంగ జాతరలో ఏరులై పారిన మద్యం
Comments
Please login to add a commentAdd a comment