బీజేపీ నాయకుడిపై దాడి దారుణం
రామసముద్రం : కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులపై దాడులు చేయడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. రామసముద్రంలో కొద్దిరోజుల క్రితం టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తిని ఆదివారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా దాడికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణమూర్తిపై దాడిచేసిన టీడీపీ నాయకులను వదిలే ప్రసక్తి లేదన్నారు. వాలీశ్వరస్వామి ఆలయ అర్చకుడి విషయంలో హైకోర్టు నిర్ణయానికి విరుద్ధంగా చేస్తుంటే, వారికి మద్దతుగా నిలిచినందుకు బీజేపీ నాయకులపై దాడిచేయడం సిగ్గుచేటన్నారు. దాడి విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నా విడిచిపెట్టమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండి ఆనంద్, నారదరెడ్డి, ఆనందనాయుడు, చలపతి, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యంనాయుడు, వెంకటేష్, జయరాం, భగవాన్, లోకనాథస్వామి, బాలస్వామి, శంకరస్వామి, సుందరం, అశోక్, శంకర, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment