ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న ఓబిలి గ్రామస్తులు
పెనగలూరు : మండలంలోని ఓబిలి గ్రామ సమీపంలోని చెయ్యేరు నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను ఓబిలి గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ఓబిలి, అత్తిగారిపల్లి గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే బోర్ల వద్దకు ఇసుకను తీసుకెళ్తుండటంతో తాగునీటి సమస్య తలెత్తుతుందని గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. గ్రామస్తులు లేనప్పుడు తిరిగి యథావిధిగా ఇసుకను తరలిస్తుండటంతో జేసీబీతో నాలుగు అడుగుల గుంత తీసి ట్రాక్టర్లు వెళ్లకుండా అదుపు చేశారు. వేసవి కాలం రానుండటంతో నీటి సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్తగా ట్రాక్టర్లను అడ్డుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న ఓబిలి గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment