అశ్వవాహనంపై భద్రకాళీ సమేత వీరభద్రుడు
రాయచోటి టౌన్ : రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భద్రకాళీ సమేత వీరభద్రస్వామి అశ్వవాహనంపై పుర వీధులలో ఊరేగారు. భక్తుల కోర్కెలు తీర్చుతూ పార్వేటకు వెళ్లారు. మంగళవారం ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్ స్వామి, మల్లికార్జున స్వామి, ఆలయ వేదపండితులు రాచరాయ యోగీ స్వామి ఆధ్వర్యంలో పార్వేటకు వెళ్లారు. ఈ వేడుకలో భాగంగా స్వామి వారిని, అమ్మవారిని రంగురంగుల పూలు, బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలతో అందంగా అలంకరించారు. ఈ ఊరేగింపులో భాగంగా స్వామివారికి అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. తుమ్మల హరినాథ ఆధ్వర్యంలో శిబ్యాల బలిజపల్లె కళాకారులతో కోలాటం, చెక్క భజనలు భక్తులను అలరించాయి. అలాగే ఉదయం సరస్వతీ దేవి పూజ నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.
మహా సంప్రోక్షణకు ఒంటిమిట్ట రామాలయం సిద్ధం
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న మహా సంప్రోక్షణకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా గర్భాలయ విమాన గోపురంపై స్వర్ణకలశం ఏర్పాటు చేసేందుకు చెక్కతో ప్రత్యేక మెటికలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, వేసవి ఎండ నుంచి ఉపశమనం కోసం జర్మన్ షెడ్లు, ఆలయ మాడవీధుల చుట్టూ చలువ పందిళ్లు, రామాలయం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరమైన అలంకరణ ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మహా సంప్రోక్షణకు ఆలయ అర్చకుల సూచనల మేరకు టీటీడీ సివిల్ విభాగం అధికారులు యాగశాలను తీర్చిదిద్దారు.
అశ్వవాహనంపై భద్రకాళీ సమేత వీరభద్రుడు
అశ్వవాహనంపై భద్రకాళీ సమేత వీరభద్రుడు
Comments
Please login to add a commentAdd a comment