నేను ఎప్పటికీ ఆకేపాటి వెంటే
రాజంపేట టౌన్ : తాను, తన కుటుంబం ఎప్పటికి వైఎస్సార్‌సీపీలో కొనసాగుతూ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వెంటే ఉంటామని హెచ్.కొత్తపల్లె మాజీ సర్పంచ్ చొప్పా గోపాల్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఆకేపాటి భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకేపాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిర్వహించిన సమావేశంలో తాను ఉన్న ఫొటో పత్రికల్లో వచ్చిందన్నారు. వాస్తవానికి తాను తనకు తెలిసిన ఓ వ్యక్తి మాట్లాడేంందుకు ఫోన్ చేయగా అక్కడికి వెళ్లానని, అక్కడ జరిగిన సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆకేపాటి అమరనాథ్‌రెడ్డితో తమకు నలభై ఏళ్ల అనుబంధం ఉందన్నారు. తాను ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని అలాగే అమరనాథ్‌రెడ్డికి మద్దతుగా ఉంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment