ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మహా సంప్రోక్షణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి టీటీడీ పాంచరాత్ర ఆగమన సలహాదారు రాజేష్ కుమార్, వేదపండితులు భగవత్పుణ్యాహం, అగ్ని మదనం, ప్రధాన మూర్తి హోమాలు జరిపారు. సాయంత్రం 5.30 గంటల నుంచి చతుస్థానార్చనము, సహస్ర కలశాధివాసం, శాత్తుమొర నిర్వహించారు.
రామయ్య క్షేత్రానికి భక్తుల తాకిడి పెంచుతాం...
ఒంటిమిట్ట రామాలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల బృందంలోని రాముడు సతీ సమేతంగా బాలాలయంలోని మూలమూర్తులను దర్శించుకున్నారు. ఈయనతోపాటు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ నుంచి డైరెక్టర్ డాక్టర్ కొండా రమేష్, ఫ్రొఫెసర్లు డాక్టర్ దీపక్ కుమార్ సింగ్, అనీల్ కుమార్‌లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంటిమిట్ట ఆలయానికి భక్తుల తాకిడి పెంచేలా, భక్తులు రామక్షేత్రంలో అడుగు పెట్టగానే భక్తి భావం కలిగేలా ప్రణాళికలు రూపొందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఏఈ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
Comments
Please login to add a commentAdd a comment