చాపాడు : అనుమానం పెనుభూతమై కట్టుకున్న భర్త భార్యను కడతేర్చేందుకు మచ్చుకత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మండలంలోని నక్కలదిన్నె పంచాయతీ కొట్టాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. మండల పరిధిలోని కొట్టాల(బీసీ కాలనీ) గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఎర్రిబోయిన భాస్కర్(48) అనే వ్యక్తి తన భార్య కళావతి(40)పై మచ్చుకత్తితో దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. ఈ ఘటనలో కళావతి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment