వసతి గృహం వార్డెన్‌పై ఫుడ్ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు
కలికిరి : కలికిరిలోని సాంఘిక సంక్షేమ శాఖ ఇంటిగ్రేటెడ్ వసతిగృహ వార్డెన్ రవీంద్రపై విద్యార్థులు, కొందరు తల్లిదండ్రులు కలికిరికి విచ్చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డిని స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఉదయం హాస్టల్‌కు చేరుకున్న ఆయన హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న మెనూపై విచారించారు. విద్యార్థులు పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో విద్యార్థులను అబద్ధాలకు తర్ఫీదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమచేత రూములు క్లీన్ చేయించడం, పాత్రలు కడిగించడం, ఇతర పనులు చేయిస్తున్నారని, పలువురు విద్యార్థులు విన్నవించారు. దీంతో వెంటనే సాంఘిక సంక్షేమశాఖ డీడీతో మాట్లాడిన ఆయన వార్డెన్‌కు వెంటనే మెమో ఇవ్వాలని, వారం రోజులలోపు మరో వార్డెన్‌ను నియమించి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ఏపీఎంజేపీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను తనఖీ చేసిన ఆయన విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలు, మెనూపై విచారించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్‌ఓ రఘురాం, ఎంఈఓలు కరీముల్లా, నాగార్జున, సీఎస్ డీటీ విజయ్‌కుమార్‌రెడ్డి, తూనికలు, కొలతల అధికారి నాగరాజ తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.
విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలి
పీలేరు : ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కామాటంపల్లె, ప్రకాశంరోడ్డు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం జెడ్పీ బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేసి ఇస్కాన్ ద్వారా సరఫరా అయిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చిత్తూరు మార్గంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, తిరుపతి రోడ్డులోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్యం చాలా ముఖ్యమని, అందుకు తగ్గట్లు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ రఘురాం, తహసీల్దార్ భీమేశ్వర్‌రావు, సీఎస్ డీటీ విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment