వ్యాపారిని కారు ఢీకొన్న ఘటనపై కేసు నమోదు
నిమ్మనపల్లె : నిర్లక్ష్యంగా వేగంగా కారు నడిపి ఎదురుగా ద్విచక్ర వాహనంలో వస్తున్న పానీపూరి వ్యాపారి శ్రీనివాసులు అతని భార్య లలితను ఢీకొన్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. బుధవారం రాత్రి నిమ్మనపల్లి– మదనపల్లె మార్గంలో, రెడ్డివారిపల్లి పంచాయతీ పిట్టావాండ్లపల్లె వద్ద, సోమల మండలం తమ్మినాయన పల్లి పంచాయతీ కురువపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, మదనపల్లి పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీ పెట్రోల్ బంక్ వద్ద పానీపూరి వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం భార్య లలితతో కలిసి స్వగ్రామానికి వెళ్లి తిరిగి సాయంత్రం ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వస్తున్నారు. అదే సమయంలో మదనపల్లె వైపు నుంచి వచ్చిన గుర్తు తెలియని కారును డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ శ్రీనివాసులు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని భార్య లలిత, బంధువు రమేష్ సాయంతో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment