● తండ్రి స్ఫూర్తితో.. ఆయన అడుగుజాడల్లోనే...
కడప ఎడ్యుకేషన్: మేము చిన్నతనం నుంచే తండ్రి స్పూర్థితో తీసుకుని బాగా చదువుకుని నేడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎంతో మంది పిల్లలకు సేవలందిస్తున్నామని యోగివేమన విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ పుత్తా పద్మ పేర్కొన్నారు. వివరాలు అమె మాటల్లోనే.. ‘నా పేరు పుత్తా పద్మ. చెన్నూరు మండలం చిన్నమాచుపల్లి. తండ్రి నాగమునిరెడ్డి, తల్లి నీరజ. మా నాన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేస్తూ చివరిగా కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ పొందారు. ఆయన లెక్చరర్‌గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు బోధనలందించి ప్రయోజకులను చేశారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా బాగా చదువుకుని నేడు ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నా. నేను ఎల్‌కేజీ నుంచి పదవ తరగతి వరకు కడపలోని విద్యామందిర్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్‌ను అనంతపురంలోని నేషనల్ సాయిబాబా ఎయిడెడ్ కళాశాలలో, డిగ్రీ తిరుపతిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదివాను. ఎంఏ, ఎంఫిల్ అనంతపురంలోని ఎస్‌కే యూనివర్సిటీలో, పీహెచ్‌డీ తిరుపతి మహిళా యూనివర్సిటీలో పూర్తి చేశాను. 1998లో నేను కడపలోని సుబ్బిరెడ్డి ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరాను. 2006లో ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ 2007లో కడపలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు బదిలీపై వెళ్లాను.2007 చివరిలో కడప యోగివేమన యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరా. 2013లో ప్రొఫెసర్‌గా అక్కడే పదోన్నతి పొందా. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా, చీఫ్ ఎగ్జామినర్‌గా, ఉమెన్ కన్వీనర్‌గా, హెచ్‌ఓడిగా, డీన్‌గా పలు హోదాల్లో పనిచేశా. ప్రస్తుతం ఎస్‌కే యూనివర్సిటీకి కూడా బోర్డ్ ఆప్ స్టడీస్ చైర్మన్‌గా, పులివెందుల జేఎన్‌టీయూకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా పనిచేస్తున్నా.’ కోవిడ్ సమయంలో వైవీయూలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా పనిచే సిన ఈమె జిల్లాలోని అన్ని కళాశాలల్లో కట్టదిట్టంగా పరీక్షలను నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment