● వాటర్ ఉమెన్ పారేశమ్మ
బి.కొత్తకోట: నీటి పొదుపు, భూగర్భజలాల వినియోగం, చిరుధ్యానాల సాగుపై గ్రామీణుల్లో చైతన్యం తీసుకొచ్చిన పారేశమ్మ వాటర్ ఉమెన్‌గా నిలిచి అవార్డు అందుకొంది. తంబళ్లపల్లె మండలం గొపిదిన్నెకు చెందిన పారేశమ్మ ఐటీఐ పూర్తి చే సి గుజరాత్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థలో రిసోర్స్‌పర్సన్‌గా పనిచేసింది. తంబళ్లపల్లెల్లో ఈమె పంటల సాగు, వనరుల సంరక్షణ, గ్రామస్తులతో సంఘాల ఏర్పాటు చేయడంపై కృషి చేస్తూ రైతుల్లో మార్పు తీసుకొచ్చింది. ఈమె కృషిని అంతర్జాతీయ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, కేంద్రప్రభుత్వ పరిధిలోని జాతీయ వాటర్ మిషన్ గుర్తించాయి. 2021లో ఉమెన్ వాటర్ అవార్డుకు 41 మంది ఎంపికవగా అందులో ఏపీ నుంచి పారేశమ్మ ఒకరు. అంతేకాదు..గ్రామీణప్రాంతాల్లో స్ఫూర్తిదాయక మహిళలు, మహిళా సంఘాలకు చెందిన మహిళల కథలను వెలుగులోకి తీసుకొస్తుంటుంది.రాష్ట్రపతి ద్రౌపదిముర్ము స్వచ్ఛ సుజల్ శక్తికి అభివ్యక్తి–2023 పేరుతో కేంద్రప్రభుత్వం వెలువరించిన నివేదికలో నీటిసంరక్షణ, చిరుధాన్యాల సాగులో విశేష కృషి చూపిన మహిళల గురించి ప్రస్తావనలో పారేశమ్మకు చోటు దక్కింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన సంకల్పదివస్ సంస్థ రూ.12వేల నగదు, అవార్డుతో సత్కరించింది. తంబళ్లపల్లెలోని 33 పల్లెల్లో పారేశమ్మ రీసోర్స్‌పర్సన్‌గా పనిచేసింది. పంటల సాగు, భూగర్భజలాల మట్టాన్ని అంచనా వేసి పంటలకు ఎంత నీటి వ్యయం అవుతుంది, ఏ పంటలు సాగు చేయాలో రైతుల్లో అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment