పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి
రాయచోటి : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ఆర్థిక ప్రగతికి పరిశ్రమలు దోహదం చేస్తాయని కలెక్టర్ అన్నారు. పరిశ్రమల వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించి జిల్లా ఆర్థిక ప్రగతి కూడా మెరుగుపడుతుందన్నారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలని తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఔత్సాహిక నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా పరిశ్రమలశాఖ అధికారులు, బ్యాంకు అధికారులు దృష్టి సారించాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలన్నారు.
33 యూనిట్లకు రాయితీలు :
జిల్లాలో 33 యూనిట్లకు రూ. 2.93 కోట్లు మేర రాయితీలను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి ప్రోత్సాహక రాయితీ కేంద్రం జిల్లాలో మొత్తం 22 యూనిట్లకు రూ. 2.72,96,776లు పావలా వడ్డీ రాయితీ క్రింద 4 యూనిట్లకు రూ. 4,96,592లు, విద్యుత్ రాయితీ క్రింద 7 యూనిట్లకు రూ. 15,83,583లు మంజూరుకు కమిటీ ద్వారా ఆమోదం తెలియజేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు జి కృష్ణారావు, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి ఆంజనేయులు, డిఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, విద్యుత్ శాఖ డిఈ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి అనీల్ కుమార్, డిక్కీ, టిక్కి జిల్లా ప్రతినిధులు శివశంకర్, రామ్మూర్తి నాయక్, సిక్కి అసోసియేషన్ అధ్యక్షులు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, కమర్షియల్ ట్యాక్స్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
33 యూనిట్లకు రూ. 2.93 కోట్ల మేర రాయితీలు మంజూరు
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment