బ్రెడ్డు తిని ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత
తంబళ్లపల్లె : మండలంలోని కోటకొండ యూపీ పాఠశాలలో ఆరవ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు శుక్రవారం ఓ దుకాణంలో బ్రెడ్డు కొని తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వైద్యాధికారుల కథనం మేరకు వివరాలు.. కోటకొండ యూపీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులు అరవింద్ (11), జగదీష్ (11) బన్నీ (12), సంధ్య(12), అశ్విని(11) పాఠశాల బయట దుకాణంలో బ్రెడ్డు కొని తిన్నారు. కొద్దిసేపటికి అస్వస్థకు గురై వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న హెచ్‌ఎం లలితమ్మ, ఉపాధ్యాయులు పిల్లలను ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్లారు. ఎఎన్‌ఎం గంగులమ్మ, ఆశా కార్యకర్త నారాయణలు విషయాన్ని కోసువారిపల్లె మెడికల్ ఆఫీసర్ అనుపమకు తెలియజేశారు. వైద్యాధికారి మునికుమార్, ఎంఈఓ త్యాగరాజు కోటకొండకు పరుగులు తీశారు. విషయాన్ని వైద్యాధికారి అనుపమ డీఎంహెచ్‌ఓ కొండయ్యకు తెలియజేశారు. డిఎంహెచ్‌ఓ పాఠశాలకు చేరుకుని అస్వస్థతకు గురైన పిల్లలతో మాట్లాడారు. బయట తినుబండారాలు తినకూడదని సూచించారు. చికిత్స తరువాత విద్యార్థులు కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment