ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో తిరుమల–తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ పాంచరాత్ర ఆగమన సలహాదారు రాజేష్ కుమార్ వేదపండితుల బృందం మహా సంప్రోక్షణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండవరోజు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి భగవత్పుణ్యాహము, చతుస్థానార్చనము, సహస్ర కలశవాహన, రామ తారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన, పంచసూక్త హోమములు, విమాన గోపుర ఛాయ స్నాపణము, పరివార హోమం, పూర్ణాహుతి నివేదన, బలి, నీరాజనము, సాత్తుమొర చేయగా సాయంత్రం 5.30 గంటల నుండి సామూహిక విష్ణు సహస్త్రనామ పారాయణం, చతుస్థానార్చనము, మూర్తి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.
అలరించిన రామాయణ నాట్య ప్రదర్శన :
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి పుణ్యక్షేత్రంలో మహా సంప్రోక్షణ మహోత్సవాలలో బాగంగా రెండవరోజు శుక్రవారం రామాయణ నాటి ప్రదర్శన అందరినీ అలరించింది. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళాబృందం చేత వారికి స్వయంగా టీటీడీ పంచరాత్ర ఆగమన సలహాదారు రాజేష్ కుమార్ అభినందనలు తెలిపి, ఊంజల్ సేవలో ఉన్న ఉత్సవ మూర్తులకు హారతులు ఇచ్చారు. ఒక నాట్య ప్రదర్శనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కోలాట బృందాలు కూడా భక్తులను అలరించాయి. కార్యక్రంమలో అర్చకులు శ్రావణ్ కుమార్, ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
Comments
Please login to add a commentAdd a comment