
రామయ్య గోపురంపై శాస్త్రోక్తంగా స్వర్ణ కలశ ప్రతిష్ట
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయ మహా సంప్రోక్షణ మహోత్సవాల్లో భాగంగా శనివారం టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో విమాన గోపురంపై శాస్త్రోక్తంగా స్వర్ణ కలశాన్ని ప్రతిష్టించారు. ముందుగా సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులకు సహస్రనామ కలశాభిషేకానికి సిద్ధం చేసిన 1001 కలశాలలో పంచామృతాభిషకాలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ కలశాన్ని విమాన గోపురంపై శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి చరుస్థానార్చనము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం నివేదన, శాత్తుమొర చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి కళాపకర్షణ, శయ్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, శాంతిహోమం, పూర్ణాహుతి, శాతుమొర నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, తులసి గజమాలలు, ఆభరణాలతో అలంకరించి ఎదురుకోలు మండపంపై ఆసీనులు చేసి కన్నుల పండుగగా ఊంజల్ సేవను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు శ్రావణ్ కుమార్, సివిల్ విభాగం ఏఈ అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామయ్య గోపురంపై శాస్త్రోక్తంగా స్వర్ణ కలశ ప్రతిష్ట
Comments
Please login to add a commentAdd a comment