సెహరి.. ఇఫ్తార్
ఐక్యతకు.. ధార్మికతకు ప్రతిరూపం
శక్తికొద్దీ సేవలు
ఆధ్యాత్మికతకే కాకుండా సేవా భావానికి కూడా ప్రతీక రంజాన్ మాసం. ఇటీవల ఈ మాసం సందర్భంగా యువత కలిసికట్టుగా ఉపవాస దీక్షల కోసం సెహరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు యువకులు కమిటీలుగా ఏర్పడి తమ సమీపంలోని మసీదుల్లో ఈ మాసమంతా సెహరీని ఏర్పాటు చేస్తున్నారు. నెలరోజులపాటు దాతల సహకారంతో తమ సేవా భావాన్ని ప్రదర్శిస్తూ రోజేదార్ల సేవలో తరిస్తున్నారు. పలు హోటళ్లలో ఇటీవల సెహరీ ప్యాకేజీలను అందిస్తున్నారు. రంజాన్ మాసంలో సెహరీ తయారీ కోసం ప్రత్యేక వంటకాల తయారీ కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పిస్తున్నారు. వాటి తయారీలో ఎంతో అనుభవం గల వారు హైదరాబాదు, ముంబయి తదితర ప్రాంతాల రంజాన్ వంటకాల రుచులను మన ప్రజలకు అందిస్తున్నారు. నగరంలోని కృష్ణా సర్కిల్ వద్దగల షాహీదర్బార్ హోటల్‌లో పదిహేనేళ్లుగా రోజేదార్ల కోసం సెహరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ హోటల్‌లో ప్రత్యే కంగా లక్కీ డ్రాపెట్టి విజేతలకు ఉమ్రా యాత్ర అదృష్టాన్ని కల్పిస్తుండడం విశేషం. ఇలాంటి ప్రత్యేకమైన ఆఫర్లను ఇతర హోటళ్లలో కూడా నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment