ఈ రాశివారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు | Today Telugu Horoscope On July 1st, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Published Mon, Jul 1 2024 6:31 AM | Last Updated on Tue, Jul 2 2024 8:28 AM

Daily Horoscope On July 01, 2024 In Telugu

శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు; జ్యేష్ఠ మాసం; తిథి: బ.దశమి ఉ.10.59 వరకు, తదుపరి ఏకాదశి; నక్షత్రం:  అశ్విని ఉ.7.40 వరకు, తదుపరి భరణి; వర్జ్యం: సా.4.46 నుండి 6.17 వరకు; దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.22 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు; అమృత ఘడియలు: రా.1.44 నుండి 3.12 వరకు ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం: 5.32; సూర్యాస్తమయం: 6.14 

మేషం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

మిథునం: ఇంటర్వ్యూలను అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కర్కాటకం: స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

సింహం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: కుటుంబంలో చికాకులు. ఖర్చులు అధికం. పనుల్లో జాప్యం. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: కార్యజయం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.. ఆధ్యాత్మిక చింతన. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

ధనుస్సు: కుటుంబసమస్యలు ఎదురవుతాయి. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం.

కుంభం: వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: కొత్త రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
–––––––––––––––––––––

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement