ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం | Daily Horoscope On June 24, 2024 In Telugu | Sakshi
Sakshi News home page

జూన్‌ 24 దినఫలం: ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం

Published Mon, Jun 24 2024 6:35 AM | Last Updated on Mon, Jun 24 2024 8:25 AM

Daily Horoscope On June 24, 2024 In Telugu

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.తదియ తె.3.00 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.48 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.9.38 నుండి 11.10 వరకు, దుర్ముహూర్తం: ప.12.28 నుండి 1.20 వరకు, తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు, అమృతఘడియలు: ఉ.11.31 నుండి 1.07 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం: 5.30; సూర్యాస్తమయం: 6.33. 

మేషం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం.

వృషభం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మిథునం: రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: అనుకున్న పనుల్లో పురోగతి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.

కన్య: ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

తుల: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృశ్చికం: అనుకున్న పనుల్లో విజయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు  చేస్తారు. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం.

మీనం: విద్యార్థులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement