జూన్‌ 25 దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది | Horoscope Today: Rasi Phalalu On 25-06-2024 In Telugu. |Sakshi
Sakshi News home page

జూన్‌ 25 దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

Published Tue, Jun 25 2024 6:33 AM | Last Updated on Tue, Jun 25 2024 9:31 AM

Daily Horoscope On June 25, 2024 In Telugu

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.చవితి రా.1.08 వరకు, తదుపరి పంచమి; నక్షత్రం: శ్రవణం సా.4.50 వరకు, తదుపరి ధనిష్ట; వర్జ్యం: రా.8.36 నుండి 10.06 వరకు; దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.59 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.39 వరకు; అమృత ఘడియలు: ఉ.6.54 నుండి 8.24 వరకు, తిరిగి తె.5.52 నుండి 7.24 వరకు(తెల్లవారితే బుధవారం); రాహుకాలం:  ప.3.00 నుండి 4.30 వరకు; యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు; సూర్యోదయం: 5.31; సూర్యాస్తమయం: 6.34. సంకటహర చతుర్ధీ 

మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. చర్చలు సఫలం. విందువినోదాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు.

వృషభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దైవదర్శనాలు.

మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. కొన్ని పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కర్కాటకం: ముఖ్య నిర్ణయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

సింహం: కార్యజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

తుల: చేపట్టిన పనులు మందగిస్తాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. నిర్ణయాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

వృశ్చికం: కొత్త పనులకు శ్రీకారం. చర్చలు ఫలిస్తాయి. దైవదర్శనాలు.కుటుంబంలో ఆదరణ. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: ఆర్థిక లావాదేవీలు అనుకూలించవు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

మీనం: ఉద్యోగయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement