ఈ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు

Published Fri, Oct 20 2023 5:44 AM

Horoscope Today 20 October 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, ఆశ్వయుజమాసం, తిథి: శు.షష్ఠి రా.9.06 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: మూల  రా.7.31 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: సా.5.56 నుండి 7.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు, తదుపరి ప.12.09 నుండి 12.56 వరకు, అమృతఘడియలు: ప.1.21నుండి2.43 వరకు, సరస్వతీ పూజ.

సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు.

మేషం.... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.

మిథునం... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం.... కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దైవదర్శనాలు.

సింహం.... ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు.

కన్య... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

తుల.... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం.

వృశ్చికం... పనులు మందగిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు నిరుత్సాహం..

ధనుస్సు..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు.

మకరం... పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. 

మీనం.... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement