‘‘ఇసుకపై జీఎస్టీ, సీనరేజి లేకుండా చేశాం.ఎక్కడైనా స్వేచ్ఛగా ఇసుక తీసుకెళ్లొచ్చు.ఎవరైనా అడ్డుకుంటే పీడీ చట్టం కింద కేసులు పెడతాం.ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక వినియోగదారులకు అందాల్సిందే.’’
– బుధవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి.
‘‘ఉచిత ఇసుక బాధ్యత ఎమ్మెల్యేదే’’
ఇది బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిన మరోమాట.
బాబు మాటలకు, చేతలకు పొంతన కుదరటం లేదు. టీడీపీ ప్రజాప్రతినిధులే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క వినియోగదారుడికి ఉచిత ఇసుక అందకుండా చేస్తున్నారు. ఇసుక కావాలంటే రూ.3 నుంచి రూ.6 వేలు చెల్లించాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. నదులు, వంకలు, వాగులు, అసైన్డ్, అటవీ, ప్రభుత్వ భూములు వేటినీ వదలకుండా ఇసుక తవ్వితీసి అమ్మకానికి పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment