ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
కారెంపూడి: 68వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్ 14 బాల బాలికల ఖోఖో పోటీలు రెండో రోజు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. బాలుర విభాగంలో చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. అలాగే బాలికల విభాగంలో చిత్తూరు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. చిత్తూరు జిల్లా జట్లు ఈస్ట్ గోదావరిపై 10–6 తేడాతో గెలిచింది. అలాగే గుంటూరు జిల్లా జట్టు కర్నూలు జట్టుపై 10–7 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నం జట్టు విజయనగరం జుట్టుపై 9–8 తేడాతో, అలాగే ప్రకాశం జిల్లా జట్టు కడపపై 11–6 పాయింట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరాయి. బాలికల విభాగంలో.. చిత్తూరు జిల్లా జట్టు ప్రకాశంపై 10–6 తేడాతో, విజయనగరం జిల్లా జట్టు కడపపై 8–4 పాయింట్ల తేడాతో, శ్రీకాకుళం జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై 9–3 తేడాతో, విశాఖపట్నం జిల్లా జట్టు అనంతపురంపై 9–8 పాయింట్ల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయని జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సురేష్ వెల్లడించారు. బాలుర విభాగంలో సెమీ ఫైనల్స్ చిత్తూరు జిల్లా గుంటూరు జిల్లా జట్ల మధ్య, అలాగే విశాఖపట్నం జిల్లా జట్టు ప్రకాశం జిల్లా జట్ల మధ్య ఆదివారం రాత్రి జరగనున్నాయని, అలాగే బాలికల విభాగంలో సెమీ ఫైనల్స్ చిత్తూరు జిల్లా విజయనగరం జిల్లా జట్ల మధ్య, అలాగే శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లా జట్ల మధ్య జరుగుతాయని తెలిపారు. సోమవారం ఫైనల్స్ జరుగుతాయని వివరించారు.
నేడు ఫైనల్స్
Comments
Please login to add a commentAdd a comment