మూమూళ్ల వ్యవహారం నిగ్గుతేల్చేందుకు చర్యలు
తాడికొండ: రాజధాని తుళ్లూరులో అనధికారికంగా కొనసాగుతున్న పేకాట దందా వ్యవహారంపై సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘పేకాటకు రాజధాని’ కథనానికి పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. పేకాట ఆడిస్తున్న నిందితులెవరు, ఈ వ్యవహారంలో ఇంటి దొంగల పాత్ర ఎంత మేరకు ఉంది, ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఓ అధికారి పాత్ర ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైనట్లు తెలిసింది. ఆటకు వస్తున్న వ్యక్తులు ఏ ప్రాంతాలకు చెందిన వారు, ఎవరెవరు అనే దానిపై కూడా కూపీ లాగారు. వారిని కూడా విచారణకు పిలిపిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే కానీ అసలు నిందితులు, వారికి సహకరిస్తున్న ఇంటి దొంగలు తేలే అవకాశం ఉంది.
పలు రైళ్లు రద్దు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలోని పలు రైళ్లు సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈనెల 25వ తేదీన రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు–విశాఖపట్నం(17239) రైలు ఈనెల 25న రద్దు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం–గుంటూరు(17240) రైలు ఈనెల 26న రద్దు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment