ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సిద్ధం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి ఒకేషనల్, 10 నుంచి సైన్స్ కోర్సుల విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు (ప్రాక్టికల్స్) జరగనున్నాయి. ఈమేరకు ఇంటర్మీడియెట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 26,308 మంది సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర కోర్సుల వారీగా 2,082 మంది విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 119 కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. మొత్తం 119 కళాశాలల్లో నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కాగా, మిగిలిన వాటిలో ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్ జరగనుండగా, హాల్ టిక్కెట్లు మరో మూడు రోజుల్లో రానున్నట్లు ఆర్ఐఓ జీకే జుబేర్ తెలిపారు. కాగా నాన్ జంబ్లింగ్ విధానంలోప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఫిబ్రవరి ఐదు నుంచి ఒకేషనల్ కోర్సులకు.. 10 నుంచి సైన్స్ కోర్సులకు..
Comments
Please login to add a commentAdd a comment