ప్రజలకు చేరువగా సౌరవిద్యుత్
ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
మధిర: సౌర విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయగావిద్యుత్ శాఖ అధికారులతో సీఎండీ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు సౌర విద్యుత్‌పై అవగాహన కల్పిస్తూ వారి అభిప్రాయాలు సేకరించారు. గ్రామంలో దాదాపు 1,039 గృహ కనెక్షన్లు, 520 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా విద్యుత్ శాఖ, రెడ్కో ఆధ్వర్యాన సర్వే చేపట్టామని తెలిపారు.
వినియోగదారులపై భారం పడకుండా..
క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం సిరిపురంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులపై ఆర్థిక భారం పడకుండా ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్‌ను సొంత అవసరాలకు వినియోగించుకున్నాక మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు సరఫరా చేస్తే ఆదాయం పొందొచ్చని చెప్పారు. కాగా, సౌర ప్యానెళ్ల ఏర్పాటుకు అనుకూలంగా లేని 201 ఇళ్ల వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రెడ్కో అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment