ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● సిబ్బందికి ఎస్పీ రోహిత్‌రాజ్ సూచన ● ఐఎంఏ హాల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
కొత్తగూడెంటౌన్: పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్‌లో బుధవారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసు శాఖలో చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ పొందేవరకు నిత్యం శాంతి భద్రతల పరిరక్షణకు పని చేయాల్సి వస్తుందని, ఈ క్రమంలో ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా విశ్రాంతి లేని జీవితాన్ని గడపాల్సి వస్తుందని అన్నారు. అయితే నిద్రాహారాలు మాని విధులు నిర్వహించే క్రమంలో ఆ ప్రభావం ఆరోగ్యంపై పడే ప్రమయాదం ఉందని, ఈ విషయంలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో సబ్ డివిజన్‌ల వారిగా పోలీసు అధికారులు ఇలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మెడికల్ క్యాంప్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు అందజేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, వైద్యులు నాగరాజు, కృష్ణప్రసాద్, రంగారావు, రాజశేఖర్, బాబురావు, ప్రవీణ్, సీఐలు కరుణాకర్, రమేష్‌కుమార్, శివప్రసాద్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు సుధాకర్, నర్సింహారావు, లాల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment