కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నేడు తొలి డిజిటల్ లైబ్రరీ ప్రారంభం
కొత్తగూడెంలో ప్రారంభించనున్న
జిల్లా జడ్జి పాటిల్ వసంత్
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో గురువారం డిజిటల్ లైబ్రరీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ప్రారంభించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ తెలిపారు. లైబ్రరీ హాల్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 91 డిజిటల్ లైబ్రరీలు నేడు ప్రారంభం అవుతున్నాయని, అందులో జిల్లాలో కొత్తగూడెం ఉందని వివరించారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాద్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్. రవిచంద్ర, ఉప కార్యదర్శి ఎస్. ప్రవీణ్, గ్రంథాలయ కార్యదర్శి ఎండీ సాధిక్‌పాషా, క్రీడల కార్యదర్శి దూదిపాల రవికుమార్, మహిళా ప్రతినిధి నల్లమల్ల ప్రతిభ పాల్గొన్నారు.
19, 20 తేదీల్లో
ఇన్‌స్పైర్ మనాక్ పోటీలు
కొత్తగూడెంఅర్బన్: ఈనెల 19, 20 తేదీల్లో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ మనాక్ పోటీలు అన్నపురెడ్డిపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 – 24 విద్యా సంవత్సరంలో జిల్లాలో 76 ప్రాజెక్ట్లులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కాగా, ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేశారని, ఎంపికై న విద్యార్థులు ఈనెల 19న జరిగే ఇన్‌స్పైర్ మనాక్ పోటీలకు హాజరు కావాలని సూచించారు. రెండు హార్డ్ కాపీలు, ఒక సాఫ్ట్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, బోనఫైడ్ సర్టిఫికెట్, ఎగ్జిబిట్‌ను తీసుకురావాల్సి ఉంటుందని వివరించారు. పోటీలకు గైర్హాజరైన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో ఏ అంశాన్ని ఎంపిక చేసుకున్నారో దానికి సంబంధించిన ప్రాజెక్టునే ప్రదర్శించాలని, ప్రాజెక్టు లేదా విద్యార్థుల పేర్లు మారిస్తే తిరస్కరణకు గురవుతాయని తెలిపారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజును సంప్రదించాలని సూచించారు.
సర్వే పకడ్బందీగా చేపట్టాలి
అధికారులకు డీపీఓ సూచన
చండ్రుగొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి అధికారులకు సూచించారు. చండ్రుగొండలో నిర్వహిస్తున్న సర్వేను బుధవారం ఆయన తనిఖీ చేశారు. వివరాల సేకరణలో తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలని ఎన్యూమరేటర్లను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీఓ ఖాన్, హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రటరీ రాజేందర్ ఉన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో సర్వే ప్రక్రియను తహసీల్దార్ జగదీశ్వర్‌ప్రసాద్, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబ్నా, ఆర్‌ఐ మధు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment