అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
● ఎకో టూరిజం ఈడీ లక్ష్మణ్ రంజిత్‌నాయక్ ● కిన్నెరసానిలో పనుల పరిశీలన
పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ అన్నారు. బుధవారం ఆయన అద్దాలమేడ, కాటేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని, ఇందుకు సంబంధించిన నివేదికలను డిసెంబర్‌లోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం అభివృద్ధి పనులను ఎకో టూరిజం స్వాధీనం చేసుకుంటోందని, ఈ ప్రక్రియ త్వరలోనే అమల్లోకి వస్తుందని అన్నారు. ఇప్పటి వరకు పనులు ఏ మేరకు పూర్తి చేశారు, ఇంకా ఎంత సమయం పడుతుందనే వివరాలు ఆరా తీశారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నెలాఖరు నాటికి మొత్తం పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, వైల్డ్‌లైఫ్ ఎఫ్డీఓ బి.బాబు, రేంజర్ కవిత మాధురి, ఎఫ్ఎస్ఓ సురేష్, ఎఫ్బీఓ రాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment