మెరుగైన వైద్యం అందించాలి
ఎమ్మెల్యే తెల్లం, పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: మారుమూల ప్రాంత గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్, ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. వైద్యాధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కొత్త పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, సిటీ స్కాన్ మిషన్లు అందుబాటులోకి తేవాలని, అవసరమైన చోట బైక్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఐటీడీఏ ప్రాంగణంలో ఏజెన్సీ డ్రగ్స్ స్టోర్, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో టీ హబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, చైతన్య, ఈఈ తానాజీ, రవిబాబు, హరీష్ పాల్గొన్నారు.
నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలి
ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసే వస్తువులు నాణ్యంగా ఉండాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని పాఠశాలలకు బీరువాలు, డైనింగ్ సెట్లు సరఫరాకు సంబంధించిన టెండర్ ప్రక్రియను గురువారం ఆయన తన చాంబర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీరువాలు డైనింగ్ సెట్లు సరఫరా చేయడానికి వరంగల్, భద్రాచలం, ఖమ్మం, నల్గొండ నుంచి టెండర్లు వచ్చాయని, తక్కువ ధరకు కోట్ చేసిన వారి టెండర్లు ఆమోదించామని తెలిపారు. నాసిరకం సామానులు సరఫరా చేసినట్లు తెలిస్తే ఏజన్సీలను రద్దు చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఖమ్మం డీడీ విజయలక్ష్మి, జీసీసీ డీఎం సమ్మయ్య, సత్యవతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment