సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి విద్యాసంస్థల్లో మెరుగైన బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ గురువారం హైదరాబాద్‌లో సీఎండీని కలవగా పలు అంశాలపై మాట్లాడారు. సింగరేణి పాఠశాలల్లో ఒలింపియాడ్ ప్రవేశపెట్టడం, జూనియర్ కళాశాలలో జేఈఈ, నీట్‌కు బోధన, రామగుండం పాఠశాలలో సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెట్టనుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, 1975లో ప్రారంభమైన సింగరేణి మహిళా కళాశాలకు వచ్చే ఏడాది 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా స్వర్ణోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సీఎండీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment