పుస్తక పఠనం విజయ సోపానం..
ఇల్లెందురూరల్: విద్యార్థి పుస్తక పఠనం ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య, లైబ్రేరియన్‌సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం కళాశాల ఆవరణలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడమే వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన విరామ సమయంలో గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలను చదవి, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. కళాశాల గ్రంథాలయంలో విద్యార్థుల కోసం న్యూస్ పేపర్లు, అకడమిక్, పాఠ్య పుస్తకాలు, ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలను అందుబాటులో ఉంచామని వివరించారు. అనంతరం జాతీయ గ్రంథాలయ సంస్థ పితామహుడు రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment