అమెరికా వెలుపల నివసిస్తున్న ప్రజల డేటాను మెటా ఉద్దేశపూర్వకంగా ప్రమాదంలో నెట్టివేస్తుందని ఫేస్‌బుక్ విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వెలుపల ఖర్చులను తగ్గించడం కోసం ఫేస్‌బుక్ యూజర్ల డేటాను ప్రమాదంలో నెడుతున్నట్లు ఫ్రాన్సెస్ హౌగెన్ సోషల్ మీడియా, ఆన్‌లైన్ భద్రత అంశంపై నేడు ఆస్ట్రేలియా సెలెక్ట్ కమిటీకి చెప్పారు. హానికరమైన కంటెంట్ విషయానికి వస్తే ఫేస్‌బుక్ "బేర్ మినిమమ్"ను తీసివేస్తుందని హౌగెన్ తెలిపారు. హోం వ్యవహారాల శాఖ కమిటీతో ఇందుకు సంబంధించిన ఫలితాలను పంచుకుంది.
సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని ప్రోత్సహించడం, భద్రతా-బై-డిజైన్ విధానాన్ని అవలంబించడం, ఆన్‌లైన్ వల్ల కలిగే హానిని తగ్గించడం కోసం తగిన సానుకూల చర్యలు తీసుకోవాలని అన్నప్పుడు ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా "తరచుగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి చాలా విముఖత చూపుతుంది" అని ఆమె తెలిపింది. విషపూరిత ఆన్‌లైన్ వార్తలను అరికట్టడానికి ప్రధాన సాంకేతిక సంస్థల విధానాలపై సోషల్ మీడియా విచారణలో భాగంగా హౌగెన్ కమిటీతో ఈ వివరాలను పంచుకున్నారు. ఫేస్‌బుక్ అల్గోరిథంలు విపరీతమైన కంటెంట్ ప్రోత్సాహిస్తాయని, తద్వారా లాభాలు ఆర్జిస్తుందని హౌగెన్ వివరించింది. విపరీతమైన కంటెంట్ తొలగించడానికి మానిటరింగ్ వ్యవస్థను ఫేస్‌బుక్ కలిగి ఉన్న సరైన చర్యలు తీసుకోదని ఆమె పేర్కొంది. ఇలాంటి, కంటెంట్ తొలగించడం వల్ల దాని ద్వారా వచ్చే లాభాలను తగ్గించుకోవడం ఇష్టం లేక నామ మాత్రంగా మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
(చదవండి: కొత్త ఈ-పాస్ పోర్ట్‌లను హ్యాక్ చేస్తే ఇక అంతే సంగతులు..!)
Comments
Please login to add a commentAdd a comment