హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభం | Google's New Office Campus Construction On Begun At Financial District | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభం

Published Sat, Oct 14 2023 2:16 PM | Last Updated on Sat, Oct 14 2023 2:31 PM

Google's New Office Campus Construction On Begun At Financial District - Sakshi

హైదరాబాద్‌లో ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ క్యాంపస్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌ను ఆ సంస్థ గచ్చిబౌలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్యాంపస్‌ నిర్మాణానికి గత ఏడాది ఏప్రిల్‌ 28న మంత్రి కేటీఆర్‌ చేతులు మీదిగా శంకుస్థాపన జరిగింది. తాజాగా, ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.  


గూగుల్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో 7.3 ఎకరాల్లో 30 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 23 ఫ‍్లోర్‌లలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే 25,500 మందికి ఉపాధి కలగనుందని గూగుల్‌ ప్రతినిధులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement