![Kalaari Capital founder vani kola success story and business - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/6/vani-kola-success-story_0.jpg.webp?itok=QLLqqlif)
Kalaari Capital founder Vani Kola: భారతదేశంలో బిజినెస్ చేస్తూ గొప్ప సక్సెస్ సాధించిన అతి తక్కువ మందిలో 'వాణి కోలా' (Vani Kola) ఒకరు. అమెరికాలో చదివి, అక్కడే అనే సంవత్సరాలు విజయవంతమైన కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత ఇండియా వచ్చి ఇప్పుడు 100 వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న 'వాణి కోలా' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో జన్మించిన వాణి 16 సంవత్సరాల వయస్సులో పోస్ట్-సెకండరీ విద్య, ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదవడానికి 1980 చివరలో అమెరికా వెళ్ళింది. యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
నిజానికి వాణి కోలా సిలికాన్ వ్యాలీలో 22 ఏళ్ల విజయవంతమైన కెరీర్ తర్వాత వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించేందుకు 2006లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత 'వెంచర్ కాపిటల్'లో వివిధ కంపెనీల భాగస్వామ్యంతో 'కలారి కాపిటల్' అనే సంస్థను స్థాపించింది.
(ఇదీ చదవండి: యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులు - విజన్ ప్రో, మాక్బుక్, ఐఓఎస్ 17 ఇంకా..)
కలారి కాపిటల్ 2012లో 150 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అయితే ఆ తరువాత వాణి అధ్యక్షతన కేవలం నాలుగు సంవత్సరాల్లోనే.. అంటే 2017 నాటికి సంస్థ ఆదాయం 650 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ కామర్స్, మొబైల్ సర్వీసులు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో పెట్టుబడులకు నాయకత్వం వహించింది. ఆ తరువాత డ్రీమ్11, ర్బన్ లాడర్‌తో సహా అనేక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టింది.
(ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?)
వీటితో పాటు ఎంప్రోస్ అండ్ కంట్రోల్ డేటా కార్పొరేషన్ వంటి సంస్థలతో సాంకేతిక రంగంలో పనిచేయడం ప్రారంభించింది. ఈ రంగంలో సుమారు 12 సంవత్సరాల తరువాత రైట్‌వర్క్స్‌ను స్థాపించింది. నాలుగు సంవత్సరాలు సెర్టస్ సాఫ్ట్‌వేర్ సీఈఓగా కూడా ఉన్నారు. వాణి కోలా కేవలం వ్యాపారవేత్తగ మాత్రమే కాకుండా, ఆసక్తిగల పాఠకురాలు కూడా. ఈ కారణంగానే ఆమె ఆలోచనలను వ్రాయడం & పంచుకోవడం వంటివి చేసేదని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment